![]() |
![]() |
.webp)
టేస్టీ తేజ బుల్లితెర మీద ఎంతో సందడి చేస్తూ ఉంటాడు. సెలబ్రిటీస్ తో ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు. అలాంటి టేస్టీ తేజ రీసెంట్ గా అరుణాచలం వెళ్ళాడు. ఇక అక్కడ తేజ చేసిన పని చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే అరుణాచలంలో ఉండే మోక్ష మార్గం గుండా తేజ రావడం చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఆ వీడియొని ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ముందు ఆ రెండు రాళ్ళ మధ్య నుంచి రావడానికి ట్రై చేసాడు కానీ అతని వల్ల కాలేదు. "నేను మోక్ష మార్గం దగ్గరకు వెళ్లినప్పుడు నాలో ఒక భయం వచ్చింది.
నేను ఆ రెండు రాళ్ళ మధ్య పడతానో లేదో..అటు నుంచి ఇటు జాగ్రత్తగా రాగలనో లేదో అనుకున్నా..ఆ భయంతో నేను మధ్యలోనే ఆగిపోయాను. ఆ తర్వాత నేను మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అని తలుచుకుని చేయగలను అనుకున్నాను వెంటనే అటు నుంచి ఇటు వచ్చేసాను..దీన్ని బట్టి నాకు ఒకటి అర్ధమయ్యింది. మనం ఏదన్నా చేయగలము, చేస్తాము అని నమ్మితే కచ్చితంగా ఆ పని చేస్తాం" అని మోక్ష మార్గంలో తన జరిగిన ఎక్స్పీరియెన్స్ ని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియొని చూసిన నెటిజన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు. "మొత్తానికి సాధించారు ! శుభం .. హర హర మహాదేవ శంభో శంకర.. సాధించావు ఎలాగైనా...దైవం ముందు పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే హర హర హర మహాదేవ శంభో శంకరా" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
![]() |
![]() |